మీరు గొడవపడి మధ్యలో హీరోలను బలి చేయడం ఎందుకు ?

Published on Mar 27, 2022 8:53 pm IST


అభిమానం పిచ్చి ముదిరితే.. తమ అభిమాన హీరోలను కూడా చంపేస్తారు అభిమానులు. బతికి ఉన్న హీరోలకు రిప్ అంటూ వారి మరణ వార్తలను వైరల్ చేస్తున్నారు. అయినా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫ్యాన్స్‌ వార్‌ లు కొత్తేమీ కాదు. కాకపోతే.. మరీ ఇంత దిగజారుడు వ్యవహారాలు మాత్రమే కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. పైగా ఆయా హీరోల ఫోటోలను ఎడిట్ చేసి.. వాళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేయడం పిచ్చికి పరాకాష్ట అనుకోవాలి.

ఇలాంటి శృతి మించి ప్రవర్తించే ఫ్యాన్స్ ఎక్కువగా తమిళనాడులోనే ఉంటారేమో. తాజాగా తమిళ సినీ సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరో విజయ్‌ చనిపోయాడని ఓ వర్గం.. లేదు, మరో స్టార్ హీరో అజిత్‌ చనిపోయాడు అంటూ మరో వర్గం వార్ కి దిగాయి. ఇందులో భాగంగా అజిత్ ఫ్యాన్స్ #RIPJosephVijay అనే హ్యాష్‌ట్యాగ్‌ ను కూడా వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన విజయ్‌ ఫ్యాన్స్‌ అజిత్‌కు ఎయిడ్స్‌ అంటూ #Aids_Patient_Ajith అనే హ్యాష్‌ట్యాగ్‌ ను వైరల్ చేస్తున్నారు.ఫ్యాన్స్‌ గొడవపడి మధ్యలో హీరోలను బలి చేయడం అంటే ఇదే.

సంబంధిత సమాచారం :