ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి “రైజ్ ఆఫ్ రామ్” ఫైరీ బీట్స్ నేడు విడుదల!

Published on Dec 31, 2021 5:02 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి కొమురం భీముడో పాట విడుదల అయ్యి ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. ఈ చిత్రం నుండి రైజ్ ఆఫ్ రామ్ ఫైరీ బీట్స్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసేందుకు సిద్దం అయ్యింది. రామం రాఘవం పేరిట ఈ పాట ఉండనుంది. కే. శివ దత్తా గారు సంస్కృత సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరణ్ లు పాడటం జరిగింది. నేడు రాత్రి 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ తో ప్రకటించడం జరిగింది.

అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :