‘కాంతారా’ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రిషబ్ శెట్టి

Published on Dec 4, 2022 3:03 am IST


కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ సెన్సేషనల్ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ కాంతారా. అటు కన్నడలో సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ అనంతరం తెలుగు సహా ఇతర భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 400 కోట్ల పైచిలుకు కలెక్షన్ సొంతం చేసుకున్న కాంతారా ని ఆడియన్స్ ఫ్యాన్స్ విపరీతంగా ఆదరించారు. అయితే ఇటీవల ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ మూవీ. కానీ నిరాశ పరిచే విషయం ఏమిటంటే, ఓటిటి లో ఒరిజినల్ వరాహరూపం సాంగ్ లేకపోవడం. కాంతారా మూవీకి ప్రాణంగా నిలిచిన ఈ అత్యద్భుత సాంగ్ ని ఇటీవల కాపీ రైట్ ఇష్యూ కారణంగా తైక్కుడం బ్రిడ్జి వారు కోర్ట్ లో కేసు వేయడం వలన ఓటిటి లో తొలగించి దాని స్థానంలో కాంతారా టీమ్ మరొక సాంగ్ ని పొందుపరిచారు.

అయితే ఓటిటి లో రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండి వరాహరూపం ఒరిజినల్ వర్షన్ సాంగ్ కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా అమెజాన్ ప్రైమ్ వారిని, అలానే కాంతారా నిర్మాతలని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా వారందరికి మంచి బూస్ట్ నిచ్చేలా నేడు వరాహరూపం సాంగ్ పై స్పందించారు దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి. ఆయన మాట్లాడుతూ, దేవుడి దయవలన కోర్ట్ కేసు గెలిచాము, అతి త్వరలోనే ఒరిజినల్ వర్షన్ వరాహరూపం సాంగ్ ని ఒటిటి లో కూడా యాడ్ చేస్తాము అంటూ రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆ సాంగ్ కోసం కాంతారా ఫ్యాన్స్, ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

సంబంధిత సమాచారం :