దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును వారికి అంకితం చేసిన “కాంతార” నటుడు!

Published on Feb 21, 2023 12:30 pm IST

శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ కాంతారలో తన నటనకు మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ విభాగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్నారు. గత రాత్రి ముంబై లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అయితే, ఈ అవార్డును దివంగత లెజెండ్స్, నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరియు దర్శకుడు ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేశారు రిషబ్ శెట్టి.

నా ఈ చిన్న కలను సపోర్ట్ చేసిన మా కాంతార టీమ్, సాంకేతిక నిపుణులు మరియు నా జీవితానికి మూలస్తంభం ప్రగతి శెట్టి లేకుండా ఇది అసాధ్యం అని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వర్క్ ఫ్రంట్‌లో, కాంతార కు ప్రీక్వెల్ అతి త్వరలో జరుగుతుందని నటుడు ప్రకటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :