మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కమెడియన్


పెళ్లి చూపులు చిత్రం ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న కమెడియన్ ప్రియదర్శి ప్రస్తుతం మంచి అవకాశాలను దక్కించుకుంటున్నాడు. పెళ్లిచూపులు చిత్రంలో అతడి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.తెలుగులో ప్రియదర్శి కి డిమాండ్ పెరుగుతోంది. పెళ్లిచూపులు చిత్రం జాతీయ అవార్డుని సొంతం చేసుకోవడంతో అందులో నటించిన నటీ నటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

కాగా ప్రియదర్శి మరో మంచి అవకాశాన్ని దక్కించుకున్నాడు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘కారు’ లో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం లో సాయి పల్లవి, నాగ సౌర్య లు ప్రధాన పాత్రలను పోస్తిస్తున్నారు. హర్రర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రియదర్శి అర్జున్ రెడ్డి,స్పైడర్ చిత్రాలలో నటిస్తున్నాడు.