
‘నా రాకుమారుడు’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలలో నటించిన రితు వర్మను మంచి అవకాశం వరించింది. శేఖర్ కమ్ముల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన నాగ్ అశ్విన్ త్వరలో దర్శకుడిగా మారుతున్నాడు. నాని హీరోగా నటించబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా రితు వర్మను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేశారు.
నా ఫేవరెట్ హీరోలలో నాని ఒకరు. ఆయన సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో నాని హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమాలో నేను బాగా డబ్బులున్న అమ్మాయిగా నటిస్తున్నాను. తండ్రి అంటే చాలా ఇష్టం. అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపిస్తాను. అని రితు వర్మ చెప్పింది.
నాని సరసన మరొక హీరోయిన్ గా మలయాళీ భామ మాళవిక నాయర్ నటిస్తుంది. ఈ సినిమాకు రాకేశ్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.