ఇండియా లోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీడియో!

Published on Jul 16, 2021 2:20 pm IST


బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట నిన్న ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వీడియో కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో విడుదల చేయగానే యూ ట్యూబ్ షేక్ అయింది అని చెప్పాలి. సోషల్ మీడియా హోరెత్తింది. 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షణ పొందిన మేకింగ్ వీడియో గా చరిత్ర సృష్టించింది.

అయితే ఇప్పటి వరకూ ఈ వీడియో 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా 457కే లైక్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు మేకింగ్ వీడియోలలో ఎక్కువ వ్యూస్ సాధించింది ఆర్ ఆర్ ఆర్ అని చెప్పాలి. ఈ చిత్రం లో టాలివుడ్ టాప్ స్టార్ హీరో లు అయిన రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే వీరికి జోడీగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :