రోరింగ్ “భీమ్లా నాయక్”..ఆల్ టైం ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసిన ట్రైలర్.!

Published on Feb 22, 2022 11:52 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన మన టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మాస్ మసాలా డ్రామాపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి అయితే భీమ్లా నాయక్ హైప్ వేరే స్థాయిలోకి వెళ్ళిపోయింది.

ఇక ఇదే ఊపులో ఈ సినిమా మాస్ ట్రైలర్ కట్ ని చూడాలని చాలా మంది ఆసక్తి కనబరచగా మేకర్స్ చాలా సస్పెన్సు నడుమ నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ రిలీజ్ చేయడంతోనే ఈ భారీ సినిమా ట్రైలర్ తిరుగు లేని రికార్డ్స్ నమోదు చేస్తూ సంచలనమే రేపింది. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుంచి ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ వరకు రోరింగ్ రెస్పాన్స్ తో అదరగొట్టింది.

మన టాలీవుడ్ లో ఏ సినిమాకి లేని విధంగా కేవలం 13 గంటల 30 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ అందుకొని ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో వెళుతుంది. ఇదే కంటిన్యూ అయితే 24 గంటల్లో టాలీవుడ్ లో నెంబర్ 1కి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. దీని బట్టి ఈ సినిమాపై ఉన్న హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :