ఫాన్సీ రేటుకు రోబో 2.0 డిజిటల్ రైట్స్ !
Published on Nov 27, 2017 3:46 pm IST

అత్యంత భారి బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రోబో 2.0. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సూపర్‌స్టార్‌ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రల్లో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆడియో ఇటివల విడుదలైన సంగతి తెలిసిందే. రెహమాన్ ఈ సినిమా పాటలతో మళ్ళి తన సత్తా చాటుకున్నాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు,హిందీ,తమిళ్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఫాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. రోబో 2.0 ట్రైల‌ర్ ను రజ‌నీకాంత్ పుట్టిన రోజైన (డిసెంబ‌ర్ 12) వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. వ‌చ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ 15 భాష‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండడం విశేషం.

 
Like us on Facebook