‘రోబో-2’ టీజర్, ట్రైలర్ ఎప్పుడంటే !


ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రంగా పేరున్న ‘రోబో-2’ హడావుడి ఇంకొద్ది రోజుల్లో మొదలుకానుంది. అది కూడా అలా ఇలా కాదు భారీ స్థాయిలో ఉండనుంది. సినిమాకు సంబందించిన ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ముందు తెలిపినట్టు ఆడియో వేడుకను అక్టోబర్ నెలలో దుబాయ్ లో నిర్వహించనున్నారు.

అలాగే టీజర్ ను నవంబర్ నెలలో హైదరాబాద్లో రిలీజ్ చేయనున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ను డిసెంబర్ లో చెన్నైలో పెద్ద ఎత్తున వేడుక నిర్వహించి విడుదలచేయనున్నారు. ఇక సినిమాను 2018 ఆరంభంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు నిర్మాతలు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండగా అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.