రజనీకాంత్ ‘రోబో2.0’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది

14th, October 2016 - 12:09:37 PM

robo2
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘రోబో2.0’. 2010లో విడుదలైన ‘రోబో’ కు సీక్వెల్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘కబాలి’ తరువాత కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్న రజనీ ఈ మధ్యే షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

ఇకపోతే ఇన్నాళ్లు ‘రోబో2.0’ ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఓ శుభవార్త బయటికొచ్చింది. అదేమంటే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ నవంబర్ 20న ఆదివారం నాడు విడుదల చేయనున్నారు. ఇంతకు ముందే ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత్ దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ సంగీతమే అందిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.