తొమ్మిదేళ్ల తరువాత బాలయ్య మూవీకి వర్క్ చేయనున్న రాక్ స్టార్ ?

Published on Jun 5, 2023 11:43 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 మూవీలో హీరోగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీని అనంతరం NBK 109 మూవీని యువ దర్శకుడు కొల్లి బాబీ దర్శకత్వంలో చేయనున్నారు బాలకృష్ణ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మితం కానున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ క్రేజీ కాంబో మూవీ పై ప్రస్తుతం ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు టాక్. 2014 లో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీసిన లెజెండ్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దాని ప్రకారం తొమ్మిదేళ్ల విరామం తరువాత మరొక్కసారి బాలకృష్ణ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుండి ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :