ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మరో లేటెస్ట్ బాలీవుడ్ హిట్.!

Published on Sep 22, 2023 9:00 am IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా మళ్లీ ఊపిరి పీల్చుకుంది. గత కొన్నాళ్ల నుంచి వస్తున్న వరుస పరాజయాలు నుంచి కోలుకొని ఇప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ భారీ హిట్స్ ని డెలివర్ చేస్తుండగా రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలు మంచి అంచనాలు సెట్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఆల్రెడీ థియేటర్స్ లో జవాన్ సినిమా ఆదరగొడుతూ ఉండగా దీనికన్న ముందు వచ్చి భారీ హిట్ అయ్యిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహానీ కూడా ఒకటి.

టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం కొన్నాళ్ల కితమే అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంటల్ గా స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు అయితే అందులో ఫ్రీ గా అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈరోజు నుంచి అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ లో ఎక్స్ట్రా డబ్బులు చెల్లించి చూడక్కరలేదు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా కరణ్ జోహార్ అపూర్వ మెహతా లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :