రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ – ఈ ఘనత సాధించిన 7వ ఇండియన్ మూవీ!

Published on Sep 5, 2023 2:01 am IST

చాలా గ్యాప్ తర్వాత, కరణ్ జోహార్ ఫ్యామిలీ డ్రామా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో దర్శకుడి గా మారారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది. ఈ చిత్రం USA బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్‌లో ఉందని మేము ఇప్పటికే నివేదించాము. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రం అమెరికాలో 10 మిలియన్ డాలర్ల మార్కును దాటింది.

ఈ ఘనత సాధించిన 7వ భారతీయ చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, పఠాన్, RRR, దంగల్, పద్మావత్, మరియు PK ఈ అద్భుతమైన ఘనతను సాధించిన ఇతర భారతీయ చిత్రాలు. ఈ ఫీట్‌ కరణ్ జోహార్‌ వలనే సాధ్యం అయ్యింది. అతని చిత్రాలకు ఉత్తర అమెరికాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ తర్వాత విడుదలైన సినిమాల థియేట్రికల్ రన్ ముగిసింది. అయితే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తోంది. ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి మరియు రోనిత్ రాయ్ సహాయక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించాయి.

సంబంధిత సమాచారం :