శ్రావణ వ్రత మంగళకార్యాల్లో రోజా , పురాణపండ శ్రీనివాస్ల శ్రీ ‘పూర్ణిమ’ తో పేరంటం

Published on Aug 14, 2019 8:23 am IST

తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఇప్పుడు పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంథాల్ని ఊరూరా ఊరేగించి పట్టాభిషేకం చేస్తున్నారనేది మన కట్టెదుర కనిపిస్తున్న సత్యం.

ఆధ్యాత్మిక రంగంలో నయా ఆవిష్కరణల కౌశలం క్రొత్త తరంలో నింపేలా అపురూప గ్రంథాల్ని రచించి, సంకలనీకరించి యుద్ధ ప్రాతిపదికన అద్భుతంగా అందించడంలో ‘ పురాణపండ శ్రీనివాస్ ‘ ది అందెవేసిన చెయ్యి మాత్రమే కాకుండా … అగ్రతాంబూలం కూడా అని తిరుమల తిరుపతి దేవస్ధానం, రామకృష్ణ మఠ్ వంటి సంస్థలే ప్రశంసలు వర్షిస్తున్నట్లు మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమేనన్నట్లు రాజకీయ సినీ రంగాల ప్రముఖులు కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చే అనేక గ్రంథాల్ని భక్త సమాజానికి సమర్పిస్తున్నారు .

పురాణపండ శ్రీనివాస్ గొప్ప వక్త. ఆయన ప్రవాహాశైలీ ప్రవచనా మాధుర్యం అద్భుతం. కంఠంలో జంకారం, వేగం, ఏ అంశాన్నైనా ముగ్ధంగా చెప్పడంలో విలక్షణత శ్రీనివాస్ కే సొంతం.

ఒక పదేళ్ల వెనుకకు వెళితే జంటనగరాల్లో ఎన్నో వేదికలపై అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకుని వేలమంది అభిమానునుల్ని సొంతం చేసుకున్న పురాణపండ శ్రీనివాస్ జీవన యాత్రలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల లక్షలకొలదీ పాఠకుల్ని తన అద్భుత గ్రంధాలతో కట్టి పడేస్తున్నారే కానీ వేదికలకు చాలా దూరంగా వుంటున్నారు.

పురాణపండ శ్రీనివాస్ వేదికెక్కి ఏం మాట్లాడినా ఒక ధ్వని కావ్యంలా ఉంటుందనేది నిర్వివాదాశం.

గత ముఖ్య మంత్రులు వై.ఎస్.రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, నారా చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖరరావు శ్రీనివాస్ అఖండ గ్రంధాలను ఆయా కాలాలలో ఆవిష్కరించి అభినందనలు వర్షించగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ శ్రావణ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గంధాన్ని ఆవిష్క రించనున్నట్లు సమాచారం.

సుమారు ఎనిమిది వందల పేజీలతో ఒక అనిర్వచనీయ దివ్యానుభూతినిచ్చే ఈ అఖండ మహా గ్రంధాన్ని ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సమర్పించడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిదాయకమైంది.

భౌతిక జీవన సౌఖ్యాల విలువ పెరిగిన ఈ రోజుల్లో అపార వైదిక మంత్ర గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ వైదిక విజ్ఞానాల వ్యాఖ్యానాలతో ఈ గ్రంధాన్ని ఘన పారిజాతంగా రూపొందించడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఈ గ్రంధం విడుదలకు ముందే తిరుమల ప్రధాన అర్చక బృందం రోజాను, పురాణపండ శ్రీనివాస్ ను మంగళా శాసనాలతో ముంచెత్తడం ఆర్ష భారతీయ సంప్రదాయానికి ఎలుగెత్తిన పతాకంగా దర్శనమిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా మహిళలు శ్రీమతి రోజా ప్రచురణ ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధాన్ని మంగళ గౌరీ వ్రతంలో పసుపు కుంకుమలతో వాయిన తాంబూలంగా పవిత్రంగా యివ్వడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విఖ్యాత సినీ పాటల రచయిత వేటూరి సుందర రామమూర్తి ఆన్నట్లు ‘ పురాణపండ శ్రీనివాస్ శబ్దజాలంలో పవిత్రమైన ఇంద్రజాలం ఉంటుంది. అతని వాక్య నిర్మాణ పద్దతిలో సంప్రదాయం, స్పష్టత, సౌందర్యం మూడూ రేసు గుర్రాల్లా పరుగులు తీస్తాయి. ప్రతీ పుస్తకంలో దైవీయ చైతన్యానికి చెందిన ఒక విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది’. వేటూరి మాట నిజమే కాబోలు ! అందుకే ఇటు రాజకీయ ప్రముఖులు , అటు సినీ ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ అమృత కలశాల్ని భక్తులకు కంటిన్యూగా అందిస్తూనే వున్నారు.

ఒక వైపు సినీ రంగ ప్రముఖులైన నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి , అశ్వనీదత్ , దిల్ రాజు, అంబికా కృష్ణ … పురాణపండ శ్రీనివాస్ తో ప్రచురించిన బుక్స్ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో దర్శనమిస్తాయి. మరొక వైపు రాజకీయ ప్రముఖులైన పొన్నాల లక్ష్మయ్య, తుమ్మల నాగేశ్వరరావు, ఆనం రామ్ నారాయణ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి వంటి ప్రముఖులు సైతం ఈ నాణ్యతా ప్రమాణాల గ్రంథాల్ని ప్రచురించి ఉచితంగా పంచడం విశేషం.

రోజా సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ యజ్ఞభావనతో అందిస్తున్న మంత్ర గాంధర్వం పేరు ‘ శ్రీ పూర్ణిమ’ .

రోజా జీవన గమనంలో ఇదొక బంగారు పళ్లెం. నో డౌట్.

కొన్ని ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలలో ప్రతిభావంతులైన చిరంజీవులకు ‘ శ్రీ పూర్ణిమ ‘ గ్రంథాల్ని బహుమతులుగా అందజేస్తున్నారు.

వై. ఎస్.ఆర్. సి.పి. రాష్ట్ర మహిళా నాయకురాలు, పార్లమెంట్ మాజీ సభ్యులు తోట నరసింహం భార్య శ్రీమతి తోట వాణి
శ్రీ నరసింహ స్వామి వారి, అమ్మణ్ణి గ్రంధాలను బహూకరించడం విశేషం.

ఈ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి, శ్రీమతి రోజాకు, పురాణపండ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ పుణ్యకార్యం లో తమకు భాగస్వామ్యం కల్పించిన వారాహి చలచిత్ర సంస్థ అధినేత సాయి కొర్రపాటి, శ్రీమతి రజని కొర్రపాటి దంపతులకు మనసారా కృతజతలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరణ కోసం నగరి జనం, భక్త జనంతో పాటు రోజా సన్నిహితులు కూడా ఎదురుచూస్తున్నారు. మంచి పనికి ఇక ఆలస్యమెందుకమ్మా …. శ్రావణమాసంలో మాకీ అద్భుతాన్ని అందించమ్మా … అంటూ రోజాని సన్నిహితులు కోరుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More