‘మా’ ఎన్నికలో తన ఓటు ఎవరికో చెప్పేసిన రోజా..!

Published on Oct 9, 2021 2:06 am IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం దగ్గరపడింది. అక్టోబరు 10వ తేదిన ఎన్నికలు జరగనుండగా ఈ సారి మా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉన్నారు. అయితే సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికలపై తాజాగా సినీ నటీ, ఎమ్మెల్యే రోజా స్పందించారు.

‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారి వాడీవేడీ వాతవరణాన్ని నెలకొల్పాయని, ఇందులో తాను వేలు పెట్టదలుచుకోలేదని అన్నారు. అయితే రెండు ప్యానెళ్ల మేనిఫెస్టోలను పరిశీలించి, ఎవరైతే అభివృద్ధి చేస్తారో అని నాకు అనిపిస్తుందో ఆ ప్యానెల్‌కే ఓటు వేస్తానని అన్నారు. లోకల్‌, నాన్‌ లోకల్‌ వివాదంపై తాని ఏమీ మాట్లాడబోనని రోజా తెలిపారు.

సంబంధిత సమాచారం :