అన్‌స్టాపబుల్: రోజాను ఇంటర్వ్యూ చేయబోతున్న బాలయ్య?

Published on Nov 20, 2021 2:00 am IST


నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, నేచురల్ స్టార్ నాని గెస్ట్‌లుగా హాజర్ కాగా, వారిని తనదైన శైలిలో బాలయ్య ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ అందించాడు.

అయితే తాజాగా ఈ షోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది. నెక్స్ట్ ఈ షోకు గెస్ట్‌గా నటి, ఎమ్మెల్యే రోజా రానుందట. త్వరలో దీనిపై ఆహా అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం కూడా ఉందని టాక్. కాగా రోజా పుట్టిన రోజున ఆమెకు కాల్ చేసిన బాలయ్య, షోకు రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. పార్టీలు, రాజకీయాలు పక్కనపెడితే, ఒక సహచర నటి, నటీలుగా వీరి మధ్య ముందునుంచి మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More