బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ లో రోజా.. నిజమేనా ?

బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ లో రోజా.. నిజమేనా ?

Published on Oct 25, 2022 5:00 PM IST

నటసింహం బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2 కూడా సూపర్ హిట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ లు గెస్ట్ లుగా వచ్చి అలరించారు. ఇక రెండో ఎపిసోడ్ లో సిద్దు, విశ్వక్ సేన్ లు గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ అండ్ రాశి ఖన్నా గెస్ట్ లు గా రాబోతున్నారట. అయితే, ఆ తర్వాత జరగబోయే ఓ ఎపిసోడ్ కి రోజా ని కూడా గెస్ట్ గా పిలవాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏపీ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి బాలయ్య రోజా తో చర్చించాలని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఇది సాధ్యం అవుతుందా?, ఆ మధ్య ఓ రాజకీయ అంశంలో బాలయ్యను రోజా విమర్శించారు. మరీ ఈ నేపథ్యంలో బాలయ్య షోకి రోజా రాకపోవచ్చు. వస్తే మాత్రం ఈ ఎపిసోడ్ పై ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

కాగా రోజా గతంలో బాలయ్యతో కలిసి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఏది ఏమైనా మ‌రోసారి బాల‌య్య‌తో `ఆహా` అనిపించే కంటెంట్ తో `అన్‌స్టాప‌బుల్‌`ని ముస్తాబు చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు