‘రొమాంటిక్‌’లో ఎమోషన్ చూసి ఎమోషనలైన పూరి !

Published on Oct 25, 2021 9:30 am IST

ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం. అయితే, చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్‌ పాదూరి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత పూరి ఎలా రియాక్ట్ అయ్యాడో చెబుతూ పూరి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ కాపీ చూసిన పూరిగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నా సినిమాలో ఇంత ఎమోషన్‌ ఉందా?. నేను తీసిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది.

మళ్లీ ఈ ‘రొమాంటిక్‌’ సినిమాలో అంత కంటే ఎక్కువగా ఎమోషన్ ఉంది’ అని పూరి చెప్పాడట. ‘మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే ‘రొమాంటిక్‌’. ఇందులో మంచి భావోద్వేగాలు ఉంటాయట. యూత్‌ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే సినిమా అట ఇది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి తన కుమారుడు కోసం ఈ రొమాంటిక్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ లను అందించాడు.

సంబంధిత సమాచారం :

More