రొమాంటిక్ నుండి విడుదల కానున్న “ఇఫ్ యూ ఆర్ మ్యాడ్ ఐయాం యువర్ డాడ్”

Published on Oct 14, 2021 11:30 am IST

రొమాంటిక్ చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తున్నారు ఆకాష్ పూరి. ఈ చిత్రం లో ఆకాష్ పూరి సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుంది. అనిల్ పాడురి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను అందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి ఇఫ్ యూ ఆర్ మ్యాడ్ ఐయాం యువర్ డాడ్ అనే పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. వైజాగ్, సీఎంఆర్ సెంట్రల్ లో ఈరోజు సాయంత్రం 6:16 గంటలకి పాటను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం లో రమ్య కృష్ణ, మందిర బేడి, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :