ఆహాలోకి రాబోతున్న ‘రొమాంటిక్’.. ఎప్పటినుంచంటే?

Published on Nov 17, 2021 12:54 am IST


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటించిన చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. మంచి అంచనాలతో అక్టోబ‌ర్ 29న థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.

దీంతో నాలుగు వారాల‌కే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయ్యింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో న‌వంబ‌ర్ 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :

More