ప్రభాస్ ట్రైలర్ విడుదల చేయడం తో రొమాంటిక్ పై పెరిగిన అంచనాలు

Published on Oct 20, 2021 8:01 am IST

ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి పని చేస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూరి కనెక్ట్స్ మరియు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ లు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఈ చిత్రం ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేయడం జరిగింది. ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో విడుదల అయిన కొద్ది గంటలకే 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆద్యంతం రొమాంటిక్ గా సాగిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ను అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :