పుష్ప నుంచి ఆ సీన్ డిలీట్ చేస్తున్నారట..!

Published on Dec 18, 2021 8:35 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”.
భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్ల వేటలో మాత్రం తగ్గేదేలా అన్నట్టు దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ సీన్‌ని రేపటి నుంచి డిలీట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలోని సెకండాఫ్‌లో పుష్ప తన వ్యాన్‌లో కూర్చొని శ్రీ వల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు. ఆ తర్వాత పుష్ప తన చేతిని శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్‌పై వేసినట్టుగా కనిపిస్తుంది. ఈ సీన్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించినట్టు ఫీడ్ బ్యాక్ రావడం, అది సుకుమార్‌ వరకు చేరడంతో ఆ సీన్‌ని తొలగించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ఆదివారం నుంచి సినిమాలో ఆ సీన్‌ని చూపించడం లేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :