వరుణ్ తేజ్ “గని” నుండి రోమియో జూలియట్ సాంగ్ విడుదల కి సిద్ధం

వరుణ్ తేజ్ “గని” నుండి రోమియో జూలియట్ సాంగ్ విడుదల కి సిద్ధం

Published on Feb 4, 2022 1:00 PM IST


వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణ లో అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మూడవ లిరికల్ వీడియో పై చిత్ర యూనిట్ తాజాగా ఒక అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం లో మూడవ లిరికల్ వీడియో రోమియో జూలియట్ ను ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు