ఓటీటీలో రౌడీ బాయ్స్ హవా.. 10 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్..!

Published on Mar 19, 2022 10:00 pm IST


ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం “రౌడీ బాయ్స్”. కాలేజ్ బేస్డ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ లు నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ “జీ5″లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రానికి ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుంది. 10 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ని పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :