“రౌడీ బాయ్స్” డే 1 నైజాం వసూళ్లు ఎంతంటే..?

Published on Jan 15, 2022 11:00 am IST

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సినిమాల్లో యంగ్ హీరో ఆశిష్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన చిత్రం “రౌడీ బాయ్స్” కూడా ఒకటి. దర్శకుడు శ్రీ హర్ష తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ల వివరాలు కూడా బయటకి వస్తున్నాయి.

మొదటగా ఈ చిత్రం నైజాం వసూళ్ల వివరాలు ఎలా ఉన్నాయి అంటే ఈ చిత్రానికి గాను 50 లక్షల నెట్ వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. ఇంకా మిగతా వసూళ్ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :