పుష్పరాజ్ చేతుల మీదుగా “రౌడీ బాయ్స్” మూవీ “డేట్ నైట్” సాంగ్ రిలీజ్..!

Published on Jan 10, 2022 9:06 pm IST

ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “రౌడీ బాయ్స్”. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు రోల్‌రైడ లిరిక్స్ అందించగా, రంజిత్ గోవింద్, సమీర భరద్వాజ్ ఆలపించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ చక్కటి సంగీతాన్ని అందించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :