ఇంటర్వ్యూ: సినిమా మొదలయ్యేది ఒక బ్యాంగ్ తో… రౌడీ బాయ్స్ మూవీ డైరెక్టర్ హర్ష

ఇంటర్వ్యూ: సినిమా మొదలయ్యేది ఒక బ్యాంగ్ తో… రౌడీ బాయ్స్ మూవీ డైరెక్టర్ హర్ష

Published on Jan 11, 2022 5:26 PM IST

 

ఆశిష్ హీరోగా పరిచయం చేస్తూ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ, శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలను డైరెక్టర్ హర్ష మీడియా తో పంచుకున్నారు.

 

హుషారు చిత్రం తర్వాత ఈ చిత్రం చేయడానికి స్ఫూర్తి ఎంటి?

నా రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల తో సినిమా తీయడం జరిగింది. రెండు కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్. హీరో పాత్ర చాలా క్రేజీ గా ఉంటుంది.

 

హుషారు లో రాహుల్ రామకృష్ణ కీ రోల్ చేశారు, మరి ఇందులో..!

ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో బిజీ అయిపోయారు. ఈ చిత్రం లో రచ్చ రవి చేశారు.

 

ఈ సినిమా కి ఆశిష్ ను ముందుగానే అనుకున్నారా?

ముందు స్క్రిప్ట్ రాశాక, దిల్ రాజు గారు కన్ఫర్మ్ చేశారు. ఇందులో ఏ హీరో అని ముందుగా ఫిక్స్ అవ్వలేదు. యంగ్ హీరో ఎవరైనా ఉంటే చేద్దాం అని అనుకున్నాను.

 

రాజు గారి బ్యానర్ లో సినిమా చేయడం ఒక ఎత్తు, వారి ఫ్యామిలీ పర్సన్ తో సినిమా చేస్తున్నప్పుడు ప్రెజర్ ఏమన్నా ఉందా?

అలా ఏం లేదు. చాలా ఎక్కువ కేరింగ్ తీసుకున్నా, కానీ, ఫిల్మ్ మేకింగ్ లో ఎలాంటి ప్రెజర్ లేదు.

 

ఆశిష్ ను తీసుకున్న తర్వాత దిల్ రాజు ఏమైనా చేంజెస్ చేశారా?

అలా ఎం లేదు. రాసుకున్నా పాత్ర కి, ఆయన రియల్ లైఫ్ కి అలానే ఉంది కొంచెం. అవి చూసే ఓకే సర్, బాగా సెట్ అవుతారు అని తీసుకున్నాం.

 

ఆశిష్ ఇండస్ట్రీ కి కొత్త కదా, పాత్ర కి ఎంత వరకు న్యాయం చేశారు?

యాక్టింగ్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. చాలామంది చూశారు, చెప్పారు. మీరు కూడా అదే చెప్తారు. బెస్ట్ డెబ్యూ అని చాలామంది అన్నారు. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా లా అసలు అనిపించదు. ఒక అనుభవం ఉన్న నటుడు లా చేశాడు.

 

టైటిల్ గురించి చెప్పండి.

17-18 సంవత్సరాల వయసు లో అందరికీ కూడా ఒక తెలియని క్రేజీ నెస్ అనేది ఉంటది. మెచురిటీ ఉండదు, ఆ ఇమ్మెచురిటీ తో చాలా పనులు చేస్తాం.ఆ ఏజ్ లో చాలా చేస్తూ ఉంటాం. గొడవలు కానీ, ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది. ఆలోచించి చేయరు, ఆ రౌడీ నెస్ అంటే అది. రౌడీ బాయ్స్ సినిమా స్టోరీ అదే. ఇప్పుడు చదువుకొనే వాళ్లకు అయితే బాగా కనెక్ట్ అవుతుంది. మన ఏజ్ వాళ్లకు అన్ని గుర్తుకు వస్తాయి. కాలేజీ లైఫ్ లో, రియల్ లైఫ్ లో చాలా సీన్స్ ఉంటాయి.

 

మీ మొదటి సినిమా కంటే, ఈ సినిమా కి క్వాలిటీ టెక్నీషయన్లు ఉన్నారు.

ఈ సినిమా కి కెమెరామన్ మాధి గారు, చాలా పెద్ద సినిమాలకి ఆయన చేశారు. స్క్రిప్ట్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్. చాలా డిస్కస్ చేసేవాళ్ళం. సీనియర్ అని ఆయన ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఈ పెద్ద టెక్నీషియన్లు అందరూ కాలేజి ఫిల్మ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ స్టొరీ ను చాలా ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. సినిమా లో మొత్తం 8 పాటలు ఉన్నాయి.

 

అనుపమ ను తీసుకోవడానికి కారణం?

చాలామంది ను చూశాం, కానీ మెచ్యూరిటీ ఉండాలి. అనుపమ ను టెస్ట్ షూట్ చేశాం, స్టోరీ వినగానే ఒప్పుకున్నారు. సినిమా లో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క పాత్ర కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.

 

యాక్షన్ ఎపిసోడ్స్ గురించి

సినిమా మొదలయ్యేది ఒక బ్యాంగ్ తో. ఒక సీక్వెన్స్ చాలా కష్టపడి, ఇష్టపడి చేశాం. డైలీ 2000 మంది ఉండేవారు. గట్టిగానే చేశాం.

ఈ సినిమా అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ అంతా అమ్మాయిల కోసమే ఉంటుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ తో ట్రైలర్ రిలీజ్ చేయించడం ఎలా అనిపించింది?

పక్కన ఉంటే ఒక హై ఉంటుంది. ఏం మాట్లాడాలి అన్నా రావడం లేదు. ఆయన ఇంక హుషారు గురించి మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా థాంక్స్ చెప్పాలి. వాళ్ళ వల్లనే అందుకుంది, సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆయన ఎనర్జీ, మాట్లాడే విధానం నెక్స్ట్ లెవెల్ అంతే. అదొక బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. రాజు గారి వల్ల అదృష్టం అని చెప్పాలి.

 

మీ బలాలు ఎంటి, ఏ జోనర్ లో ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది.

ఒక మూవీ మేకర్ గా అన్ని సినిమాలు చేయాలని ఉంది. రియలిస్టిక్ గా, కమర్షియల్ గా తీద్దాం అని,అందరికీ రీచ్ అయ్యేలా సినిమాలు చేయాలి అని ఉంది. రాజ్ కుమార్ హిరానీ స్టైల్ లో ఒకటి రాస్తున్నా, ఇంకోటి ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ రాస్తున్నా. ఇంకా నెక్స్ట్ సినిమా కి కమిట్ అవ్వలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు