ఆకట్టుకుంటున్న రౌడీ బాయ్స్ టీజర్!

Published on Sep 20, 2021 8:07 pm IST


ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. కాలేజ్ లో జరిగే గొడవలు, అల్లర్లు, ప్రేమ, వినోదం ను సమపాళ్ళలో ఈ చిత్రం లో చూపించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. తాజాగా విడుదల అయిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ లు ఈ రౌడీ బాయ్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :