రౌడీ బాయ్స్ టీజర్ విడుదల కి ముహూర్తం ఫిక్స్!

Published on Sep 20, 2021 4:00 am IST

హర్ష కోనుగంటి దర్శకత్వం లో ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఈ మేరకు ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై తాజాగా చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను ఈ నెల 20 వ తేదీన సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :