“బిగ్ బాస్ 5” స్టేజ్ పై ‘రౌడీ’ బ్రదర్స్..మరింతమంది స్పెషల్ గెస్టులు

Published on Oct 31, 2021 12:00 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పైన అతి పెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని తెలిసిందే. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ గ్రాండ్ షో ఇప్పుడు మరింత ఎంటర్టైనింగ్ గా కొనసాగుతుంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు వీకెండ్ వచ్చింది అంటే కింగ్ నాగ్ ఎంట్రీతో సందడి మరింత రెట్టింపు అవుతుంది.

అలానే ఇంకో పక్క దీపావళి సంబరాలు ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో అదిరే లెవెల్లో ఉండబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. మరి ఈ లేటెస్ట్ ప్రోమోలో మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో కలిసి వచ్చారు.

వచ్చి ఈ రౌడీ బ్రదర్స్ నాగ్ తో కలిసి కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. ఇక అలాగే మరింత మంది స్పెషల్ గెస్టులు కూడా ఈ ఎపిసోడ్ లో కనిపిస్తున్నారు. శ్రేయ, యాంకర్ సుమ ఇలా ఈ ఎపిసోడ్ లో కనిపించారు. మొత్తానికి మాత్రం ఈ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా కనిపిస్తుంది. ఇక టెలికాస్ట్ లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :