తెలంగాణా ప్రభుత్వానికి రౌడీ హీరో స్పెషల్ థాంక్స్.!

Published on Dec 25, 2021 4:00 pm IST

గత రెండేళ్లు కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతలా నష్టం చవి చూసిందో అందరికీ తెలిసిందే. అలాగే ముఖ్యంగా థియేటర్స్ సంస్థలు వారు ఈ కరోనా సమయంలో అయితే మరింత తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన ప్రభుత్వాలు వారికి కొన్ని హామీలు కూడా ఇచ్చారు.

మరి తాజాగా తెలంగాణా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో టాలీవుడ్ హీరోలు మరియు అక్కడి థియేటర్స్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా సవరించిన టికెట్ ధరలతో మొదటగా మెగాస్టార్ చిరు తన స్పందనను తెలియజేయగా ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చాడు.

చిత్ర పరిశ్రమని అభివృద్ధి చెయ్యడానికి తెలంగాణా ప్రభుత్వం నూటొక్క శాతం కూడా ప్రయత్నం చేస్తుంది అని ఎకానమీ పెంచేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభత్వం వారు తీసుకున్న టికెట్ రేట్లు సవరణ నిర్ణయానికి థాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని మంత్రి కేటీఆర్, కెసిఆర్ మరియు తలసాని లకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఐ లవ్ గవర్నమెంట్, తెలుగు సినిమా దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీస్ లో ఒకటని కొత్త జీవోతో తెలిపాడు.

సంబంధిత సమాచారం :