సాయి తేజ్ కేస్ పై ఆర్ పి పట్నాయక్ సూటి ప్రశ్న.!

Published on Sep 11, 2021 3:00 pm IST

ప్రస్తుతం సినీ వర్గాల్లో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కోసమే చర్చ నడుస్తుంది.. ఇక మన తెలుగు సో కాల్డ్ మీడియా కోసం చెప్పక్కర్లేదు.. ఉన్నవీ లేనివి అన్నీ కల్పించి చెప్పేస్తున్నారు. మరి ఈ క్రమంలో సాయి తేజ్ సాయి తేజ్ కి ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఎవరికి నచ్చిన వెర్షన్ లు వారు చెప్పుకుంటున్నారు. కానీ ఒరిజినల్ సీసీ టీవీ వీడియోని చూసినవారు మాత్రం సాయి తేజ్ ది ఎలాంటి తప్పు లేదని ఒక నిర్ధారణకు వస్తున్నారు.

అయినా కూడా దానిని సెన్సేషన్ లా పలువురు చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడ సాయి తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయం కూడా బయటకి రావడంతో పలువురు సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ప్రశ్న చాలా సూటిగా క్లియర్ గా ఉందని చెప్పాలి. సాయి తేజ్ మీద కేసు వేసిన పోలీసులు ఆ రోడ్డు అలా ఉన్నందుకు దానిని అలా ఇసుక ఉండేలా ఇంకా క్లీన్ చెయ్యకుండా వదిలేసిన కారకులు పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు.

“సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన అక్కడ ఉన్న నిర్మాణం కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం.” అని వ్యక్తం చేయగా తనతో అనేక మంది ఏకీభవిస్తున్నారు.

సంబంధిత సమాచారం :