విషాదం : ‘ఆర్ఆర్ఆర్’ నటుడి అకాల మరణం

Published on May 22, 2023 11:33 pm IST

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ స్థాయిలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. గత ఏడాది గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్ల పైచిలుకు కలెక్షన్ తో పాటు అనేక దేశాల, భాషల ఆడియన్స్ ని మెప్పించింది ఈ మూవీ. ఇక ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో బ్రిటిష్ గవర్నర్ స్కాట్ బక్సన్ పాత్రలో హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకన్నారు. విషయం ఏమిటంటే, స్టీవెన్సన్ నిన్న ఇటలీలో హఠాన్మరణం పొందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

58 ఏళ్ళ వయసుగల ఆయన మృతికి గల అస్లు కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. పనిషర్ వార్ జోన్, ది థియరీ ఆఫ్ ఫ్లైట్, అలానే హెచ్ బి ఓ మరియు బిబిసి ప్రశంసలు పొందిన టెలివిజన్ ధారావాహిక రోమ్‌లలో స్టీవెన్సన్ తన పాత్రలతో ప్రసిద్ధి చెందాడు. డెక్స్టర్, ది వాకింగ్ డెడ్, బ్లాక్ సెయిల్స్, వైకింగ్స్ మరియు అనేక స్టార్ వార్స్ యానిమేటెడ్ షోలు వంటి ప్రముఖ షోల ద్వారా కూడా మంచి పేరు అందుకున్నారు. ఇక స్టీవెన్సన్ తదుపరి డిస్నీ ప్లస్ స్టార్ వార్స్ సిరీస్ అశోకాలో కనిపించనున్నారు, ఇది అతి త్వరలో ప్రీమియర్ గా ప్రసారం కానుంది. స్టీవెన్సన్ చివరిగా పూర్తి చేసిన సినిమా యాక్సిడెంట్ మ్యాన్ హిట్‌మ్యాన్స్ హాలిడే. మా 123తెలుగు వెబ్ సైట్ తరపున రే స్టీవెన్సన్ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాము.

సంబంధిత సమాచారం :