“RRR” లో పెట్టని సీన్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన కీలక నటి.!

“RRR” లో పెట్టని సీన్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన కీలక నటి.!

Published on Apr 12, 2022 10:50 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా 3 గంటలు ఉన్నా కూడా ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో థ్రిల్ ని అందించింది. ఇంకా ఉంటే కూడా బాగున్ను అని అనుకోని వారు కూడా లేకపోలేరు.

అయితే ఈ సినిమా స్టార్టింగ్ లోనే కనిపించే సన్నివేశంలో నటి ఆహ్మ్రీన్ అంజుమ్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఒక ఫోటోని షేర్ చేసి ఈ సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్ లోనిది అని ఆ సన్నివేశం సినిమాలో యాడ్ చెయ్యలేదని ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లు అన్నీ కూడా నాకు ఎంతో ఇష్టం అని ఆమె తెలిపింది. దీనితో ఈ సీన్స్ ని RRR ఓటిటి లో రిలీజ్ చేసేటప్పుడు యాడ్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు ఒకింత ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు