RRR : ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీనింగ్ కి రెడీ.!

RRR : ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీనింగ్ కి రెడీ.!

Published on Mar 1, 2023 8:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రైడ్ ఇండియన్ సినిమాగా అనేక ఘనత లు అందుకుంటూ సస్తుండగా మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ లో సత్తా చాటనుంది. మరి ఈ ముందు కూడా వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న ఈ సినిమా పేరు యూఎస్ లో మరింత స్థాయిలో వినిపిస్తుంది.

మరి ఈ భారీ సినిమా ఇప్పుడు ప్రపంచం లోనే అతి పెద్ద స్క్రీనింగ్ కి ఇప్పుడు రెడీ అయ్యింది. యూఎస్ లోని ఏస్ హోటల్ థియేటర్ లో అయితే మొత్తంగా 1647 సీటింగ్ కెపాసిటీ తో ప్లాన్ చేసిన మాసివ్ స్క్రీనింగ్ ఈరోజు జరుగుతుండడం విశేషం. దీనితో ఈ బిగ్గెస్ట్ షో అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి పడనుంది. అయితే ఈ స్క్రీనింగ్ లో మొత్తం హౌస్ ఫుల్ కావడం సెన్సేషనల్ అంశం అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ స్క్రీనింగ్ లో సెలెబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు