ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలు!

Published on May 20, 2022 9:00 am IST

బాక్సాఫీస్ వద్ద సందడి తర్వాత రెండు చిత్రాలు నేడు ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం చిత్రం నేటి నుండి జీ 5 లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. తెలుగు లో మాత్రమే కాకుండా, సౌత్ బాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. అయితే హిందీ వెర్షన్ లో సినిమా చూడాలంటే నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సి ఉంది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుండి నెట్ ఫ్లిక్స్ లో హిందీ భాషలో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

నేడు ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన మరో చిత్రం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో ఆకట్టుకోలేదు. నేటి నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సోనూ సూద్ ముఖ్య పాత్రలో నటించగా, ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ రూపం లో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :