ఎనర్జిటిక్ గా ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ సాంగ్ “ఎత్తర జెండా”

Published on Mar 14, 2022 7:17 pm IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ను మార్చ్ 25 వ తేదీన భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం లోని సెలబ్రేషన్ సాంగ్ అయిన ఎత్తర జెండా పాటను తాజాగా విడుదల చేయడం జరిగింది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితీ చాగంటి, హారిక నారాయణ్ లు పాడటం జరిగింది. ఫుల్ జోష్ గా మరియు అభిమానులకి మరింత ఎనర్జీ ఇచ్చేలా ఈ పాట ఉంది.

అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :