క్రేజీ : జపాన్ లో మరో అరుదైన ఫీట్ సెట్ చేసిన “RRR”.!

Published on Jan 28, 2023 2:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ వరల్డ్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ హైప్ తో వచ్చి ఇప్పటికీ వరల్డ్ వైడ్ అనేక రికార్డులు సృష్టిస్తూ అనేక రివార్డులు అందుకుంటున్న ఈ చిత్రం జపాన్ లో కూడా రిలీజ్ అయ్యి ఊహించని రీతి విజయాన్ని అక్కడ నమోదు చేసింది.

మరి ఆల్రెడీ వసూళ్ల పరంగా భారీ మార్జిన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు అయితే జపాన్ లో మరో అరుదైన ఫీట్ ని సెట్ చేసి మరో కొత్త రికార్డు నెలకొల్పింది. మరి ఈ సినిమా అయితే అక్కడ 100 రోజుల థియేట్రికల్ రన్ ని మొత్తం 114 కేంద్రాల్లో జరుపుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

దీనితో ఈ చిత్రం జపాన్ లో 100 రోజు ప్రదర్శితం కాబడిన మొదటి భారతీయ సినిమాగా ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. దీనితో ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ కి గాను చిత్ర యూనిట్ జపాన్ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :