కేజీఎఫ్2 ను క్రాస్ చేసిన ఆర్ఆర్ఆర్!

Published on Mar 17, 2023 9:00 pm IST


జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం (RRR) చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను అందుకున్న ఈ చిత్రం, ఆస్కార్ అవార్డు ను కూడా అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు మరొక రికార్డ్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం జపాన్ లో ఇప్పటి వరకూ 81 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో వరల్డ్ వైడ్ గా 1236 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

కేజీఎఫ్ 2 చిత్రం 1233 కోట్ల రూపాయల తో గతేడాది టాప్ గ్రాసర్ గా నిలవగా, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ఆ ప్లేస్ ను భర్తీ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :