దుబాయ్ 2020 ఎక్స్‌పోలో “ఆర్ఆర్ఆర్” వేడుకకి సర్వం సిద్దం..!

Published on Mar 18, 2022 1:00 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయని చెప్పాలి. మరోవైపు సినిమాకి రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలపై గట్టిగా ఫోకస్ పెట్టింది చిత్రబృందం.

ఇందులో భాగంగా మార్చి 18న ఈ మూవీ స్పెషల్ ఈవెంట్ ని దుబాయ్ ఎక్స్‌పో 2020లో నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సర్వం సిద్దమైనట్టు తెలుస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక గెస్టులుగా రాబోతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :