బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను గెలుచుకున్న “ఆర్ఆర్ఆర్”

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను గెలుచుకున్న “ఆర్ఆర్ఆర్”

Published on Oct 26, 2022 1:34 PM IST


ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం చిత్రం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం తాజాగా బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్ ను గెలుచుకుంది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్ లో RRR బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ను విజేతగా ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌ఎస్ రాజమౌళి, ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా ఉప్పొంగిపోతున్నానని, ఇది తనకు రెండో సాటర్న్ అవార్డు అని కూడా పేర్కొన్నాడు. (మొదటి అవార్డు బాహుబలి: ది కన్‌క్లూజన్). RRR టీమ్ తరపున ఇతర విజేతలను కూడా అభినందించాడు. ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కావడం తో చిత్ర యూనిట్ అక్కడే ఉంది. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు