జపాన్లో మరో భారీ మైల్ స్టోన్ కి దగ్గరలో “RRR”.!

Published on Mar 22, 2023 9:00 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా గ్లోబల్ దర్శకునిగా మారిపోయిన ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా రిలీజ్ అయ్యిన జపాన్ లో అయితే ఇప్పటికీ వండర్స్ నమోదు చేస్తుంది.

మరి ఆల్రెడీ అక్కడ 1 బిలియన్ జపాన్ యిన్ వసూళ్లతో కనీ వినీ ఎరుగని మైలురాయిని అందుకోగా ఇక ఇప్పుడు మరో భారీ రికార్డు దిశగా అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు RRR నెక్స్ట్ టార్గెట్ గా 1.5 బిలియన్ దిశగా వెళ్తుండడం విశేషం.

ప్రస్తుతం ఈ చిత్రం అక్కడ 1.4 బిలియన్ మార్క్ దగ్గరకి వెళ్తుండగా ఇదే స్పీడ్ లో మరింత స్ట్రాంగ్ రన్ లో అయితే 1.5 బిలియన్ మార్క్ కూడా అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. దీనితో ఈ సినిమా జపాన్ లో ఊహలకందని రేంజ్ హిట్ గా కొనసాగుతుంది అని చెప్పి తీరాలి.

సంబంధిత సమాచారం :