ఇంట్రెస్టింగ్..జపాన్ లో “RRR” కి ఇప్పుడే మరింత రెస్పాన్స్.!

ఇంట్రెస్టింగ్..జపాన్ లో “RRR” కి ఇప్పుడే మరింత రెస్పాన్స్.!

Published on Nov 11, 2022 4:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం గ్లోబల్ గా భారీ రీచ్ అందుకున్నాక అవైటెడ్ గా జపాన్ రిలీజ్ కి ప్లాన్ చేయగా అక్కడ కూడా సాలిడ్ ప్రమోషన్స్ నడుమ భారీ లెవెల్లో రిలీజ్ చేశారు.

ఇక ఈ చిత్రానికి అక్కడ అంతకంతకు ఆదరణ పెరుగుతూ వస్తుడడం విశేషం. ఇక ఇప్పుడు అయితే ఈ చిత్రం 21వ రోజుకి చేరుకోగా అనూహ్యంగా RRR చిత్రం అక్కడ రిలీజ్ డే కన్నా ఈ 21వ రోజు వసూళ్లు ఎక్కువ నమోదు అయ్యినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనితో అయితే ఈ చిత్రం సెన్సేషన్ అక్కడ ఎలా ఉందో ఎంతలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఫైనల్ రన్ లో అయితే ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు