“RRR” హవా..జపాన్ లో బెస్ట్ చిత్రాల జాబితాలో.!

“RRR” హవా..జపాన్ లో బెస్ట్ చిత్రాల జాబితాలో.!

Published on Dec 24, 2022 8:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా సెన్సేషన్ ని రేపిన ఈ చిత్రం గ్లోబల్ గా ఇంకా దుమ్ము లేపుతుంది. ఇక గత కొన్నాళ్ల కితమే జపాన్ దేశంలో భారీ హైప్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అక్కడ అయితే ఇండియా సినిమాల నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

మరి అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా జపాన్ ఫేమస్ అండ్ లార్జెస్ట్ మూవీ సైట్ లో కూడా సత్తా చాటింది. అక్కడ హాలీవుడ్ చిత్రాల సరసన RRR ని టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. దీనితో అయితే మేకర్స్ ఈ అంశాన్ని పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన సంగీతం కూడా గ్లోబల్ వైడ్ భారీ ఆదరణ అందుకొని ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు