ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్లాక్.. ఇద్దరి మధ్య అలా ప్లాన్ చేశారా?

Published on Dec 30, 2021 2:41 am IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ చిత్రం యొక్క ఇంటర్వెల్ బ్లాక్ ఇలా ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం మొదలయ్యింది. ఇంటర్వెల్ బ్లాక్ తారక్, చెర్రీల మధ్య దాదాపు 16 నిమిషాల పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని, బ్రిటీష్ అండర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రామ్ చరణ్ వారికి వ్యతిరేకంగా పోరాడే ఎన్టీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడని, అప్పుడు ఇద్దరి మధ్య భీకరమైన ఫైట్ జరుగుతుందట. ఇదే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అని ప్రచారం జరుగుతుంది. మరీ ఇందులో ఎంతవరకు నిజముందనేది తేలాలంటే జనవరి 7 వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :