సౌత్ కొరియాలో “RRR” రిలీజ్..అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

సౌత్ కొరియాలో “RRR” రిలీజ్..అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Jun 26, 2022 7:07 AM IST


ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పీరియాడిక్ మల్టీస్టారర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో తర్వాత ఓటీటీ ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ రీచ్ ని ఈ సినిమా దక్కించుకుంది.

ఇక లేటెస్ట్ గా అయితే ఓటీటీ కంటెంట్ లో రారాజు గా మారిన సౌత్ కొరియా దేశంలో ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చినట్లు గా మేకర్స్ తెలియజేసారు. అలాగే ఆ దేశంలో ఈ చిత్రం కొరియన్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది అని మేజర్ అప్డేట్ ని రివీల్ చేశారు. ఇక ఇప్పుడు ఈ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ మొదలవుతుంది అని చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు అలాగే డివివి దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు