జపాన్లో “RRR” లేటెస్ట్ భారీ వసూళ్లు వివరాలు.!

జపాన్లో “RRR” లేటెస్ట్ భారీ వసూళ్లు వివరాలు.!

Published on Dec 7, 2022 1:30 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డులు నమోదు చేయగా ఇప్పుడు అయితే జపాన్ లో మైండ్ బ్లాకింగ్ రన్ తో ఇప్పటికీ దూసుకెళ్తుంది.

మరి అక్కడ అయితే ఆల్ టైం నెంబర్ 2 గ్రాసింగ్ ఇండియన్ సినిమాగా ఇది నిలవగా ఇప్పుడు అయితే ఈ భారీ చిత్రం జపాన్ లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మరి ఈ చిత్రం అయితే జపాన్ లో 380 మిలియన్ యిన్స్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం మొత్తం 22 కోట్లు జపాన్ నుంచి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇంకా వసూళ్లులో డ్రాప్ లేనట్టుగా కూడా టాక్. మొత్తానికి అయితే జపాన్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే ఛాన్స్ లు గట్టిగా ఉన్నాయని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు