అక్కడి స్పెషల్ షో కి ఎగ్జైటెడ్ గా “RRR” మేకర్స్..!

Published on Sep 30, 2022 7:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలు గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ భారీ ఆదరణతో అనేక చోట్ల స్పెషల్ షోస్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లో ఐమాక్స్ ది చైనీస్ థియేటర్స్ లో షో కి గాను సిద్ధం అయ్యింది.

అయితే దీనిపై ఇది వరకే మేకర్స్ కొన్నాళ్ల కితం అప్డేట్ ఇచ్చారు. మరి ఫైనల్ గా అయితే ఈ షోస్ సమయం రాగా ఈ స్క్రీనింగ్ పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నామంటూ చిత్ర యూనిట్ తెలిపారు. లాస్ ఎంజెల్స్ సిద్ధంగా ఉండాలి అంటూ తమ ఎగ్జైట్మెంట్ ని వ్యక్తం చేశారు. మరి అలాగే ఈ స్పెషల్ షో పట్ల అభిమానులు కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. ఇక ఈ భారీ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :