“RRR” జపాన్ రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం.!

“RRR” జపాన్ రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషం.!

Published on Oct 30, 2022 9:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తర్వాత వరల్డ్ వైడ్ కూడా సెన్సేషనల్ రీచ్ ని సొంతం చేసుకుంది. ఇక అలా ఈ సినిమాకి ఎంతో కీలకమైన మరో మార్కెట్ జపాన్ లో అయితే ఈ చిత్రం రిలీజ్ కి రాగా ఈ సినిమా జపాన్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది.

మరి దీనితో ఈ చిత్రం జపాన్ లో పొందుతున్న ఆదరణకు గాను మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రెండో వారానికి చేరుకున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో అయితే హౌస్ ఫుల్స్ తో సినిమా నడుస్తుంది అని డిస్ట్రిబ్యూటర్ మూవీ ట్విన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి జపాన్ లో కూడా RRR సినిమా సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు